Bitcoin 10 interesting facts in telugu


బిట్కాయిన్ ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న పేరిది. రోజు రోజుకూ అమాంతం విలువ పెరుగుతుండటంతో ఈ క్రిప్టో కరెన్సీపట్ల అందరికీ ఆసక్తి నెలకొంది. అక్టోబర్ ప్రారంభం నుంచి బిట్కాయిన్ విలువ మూడు రెట్లు పెరగడం దీని దూకుడుకు అద్దం పడుతోంది. ఓ దశలో 18,700 డాలర్ల స్థాయికి చేరిన బిట్కాయిన్ విలువ 16 వేల డాలర్ల స్థాయిలో కొనసాగుతోంది. కొద్ది రోజుల వ్యవధిలోనే దీని ధర పది వేల డాలర్ల స్థాయి నుంచి భారీగా పెరగడం గమనార్హం.
2013 ఆరంభంలో వెయ్యి డాలర్లు పెట్టి బిట్ కాయిన్ కొని ఉంటే.. ఇప్పుడు దాని విలువ సుమారు 12 లక్షల డాలర్లు. దీన్ని బట్టే బిట్కాయిన్ విలువ ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.
బిట్కాయిన్ ను కనిపెట్టిన పదేళ్ల తర్వాత దాన్ని ఎవరు కనిపెట్టారో తెలిసింది. జపాన్కు చెందిన సతోషి నకమొటో దీన్ని కనిపెట్టారని చెబుతారు. కానీ ఆయనెవరో ఎవరికీ తెలియదు. ఆస్ట్రేలియాకు చెందిన కంప్యూటర్ సైంటిస్ట్ క్రెయిగ్ వ్రైట్ బిట్కాయిన్ల గురించి ఇంటర్వ్యూలు ఇవ్వడం ప్రారంభించాడు. తనే నకమొటో అని చెప్పుకున్నాడు.
బిట్కాయిన్ 2010లో ఉనికిలో వచ్చింది. ఫ్లోరిడాకు చెందిన ఓ ప్రోగ్రామర్ 10 వేల బిట్కాయిన్ల్వెచ్చించి రెండు పిజ్జాలు కొనుగోలు చేశాడు. క్రిప్టోకరెన్సీతో జరిగిన తొలి లావాదేవీ ఇదే. ప్రస్తుతం బిట్కాయిన్ విలువ 15 వేల డాలర్లు.
ప్రపంచంలోనే అత్యంత పాపులర్ అయిన వర్చువల్ కరెన్సీ ఇది. దీనికి ఏ బ్యాంకులు, ప్రభుత్వాలతో సంబంధం లేదు. ఒక భారీ నెట్వర్క్గా ఏర్పడిన శక్తివంతమైన సూపర్ కంప్యూటర్ల ద్వారా బిట్కాయిన్లను సృష్టిస్తారు. ఈ ప్రక్రియనే మైనింగ్ అంటారు. ఎప్పటికైనా సరే.. మొత్తం బిట్ కాయిన్ల సంఖ్య గరిష్టంగా 2.1 కోట్లకు మించదు. ఈ కంప్యూటింగ్ నెట్వర్క్ ప్రపంచంలోని 500 ఫాస్టెస్ట్ సూపర్ కంపూటర్ల కంటే లక్ష రెట్లు పెద్దది.
బిట్కాయిన్లను ఎవరు పంపారు, ఎవరు పొందారో తెలుసుకోవడం అసాధ్యం. వీటిని 34 ఆల్ఫాన్యూమరిక్ క్యారెక్టర్లే బిట్కాయిన్ అడ్రస్. దీన్ని బట్టి వివరాలను చెప్పలేం. కాబట్టి బిట్కాయిన్ల ద్వారా అక్రమ లావాదేవీలు జరుగుతున్నాయి.
బిట్కాయిన్ల ద్వారా చేసిన లావాదేవీల్ని వెనక్కి తీసుకోలేం. ఒకసారి బిట్కాయిన్ను పంపితే ఏ రకంగానూ వెనక్కి తీసుకోలేం.
బిట్కాయిన్లను 2008లో రూపొందించారు. వీటిని నియంత్రించడానికి ఎలాంటి ఆర్థిక సంస్థను ఇప్పటి దాకా ఏర్పాటు చేయలేదు.
ఇప్పటి వరకూ చలామణిలో ఉన్న బిట్కాయిన్ల విలువ 283 బిలియన్ డాలర్లకు చేరింది. ఇది అనేక సంస్థల మార్కెట్ విలువ కంటే అధికం.
మన దగ్గర బిట్కాయిన్కు చట్టబద్ధత లేదు. కానీ వీటిని కొనుగోలు చేయొచ్చు. క్రిప్టోకరెన్సీఅమ్మకం ద్వారా వచ్చే లాభాలపై ఆదాయపన్ను విధిస్తారు.

Comments

Popular posts from this blog

how to earn coinbase account create earn 700 inr in instant 2days

how to earn money in online , what is bitcoin, what is block chain, how to create free websites, how to earn money from home

earn bitcoins by completing tasks?

How to earn bitcoin in this free and trusted sites

watch ads daily and get free bitcoins

Facebook plans ower own cryptocurrency launch

what is coin pot ? how to earn bitcoin & alt coins..............?